తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్దేశాలు – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్దేశాలు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు. కవి సమ్మేళనంలో కవులు ” తెలంగాణ స్ఫూర్తి” అనే శీర్షిక పై మాత్రమే తమ కవిత్వం ఉండాలని తెలిపారు. కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నవారు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు గాని తమ కవిత్వ కాపీని ఈ నెల 28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా పౌర సంబంధాల అధికారికి అందజేయాలని తెలిపారు. వచ్చిన కవిత్వాల నుండి బాగా బాగా రాసిన కవిత్వాలను కమిటి ద్వారా ఎంపిక చేసి కవులకు మెసేజ్ ల ద్వారా సమాచారం ఇవ్వబడుతుందన్నారు. ఎంపిక చేసిన కవులు, రచయితలు జూన్ 2న సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ లో నిర్వహించే కవి సమ్మేళనం కార్యక్రమానికి హాజరై తమ కవిత్వాన్ని చదవాల్సి ఉంటుందని తెలియజేసారు.

Share This Post