తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ డి. హరిచందన దాసరి

రాష్ట్ర  అవతరణ దినోత్సవానికి  అన్ని ఏర్పాట్లు పూర్తి

రేపు ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే  రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు.

తెలంగాణా రాష్ట్రం అవతరించి 8 సవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట వ్యప్తంగా  సంబురాలు జరుపుకోవడం ఆనవాయితి.  ప్రస్తుతం జిల్లా ఏర్పడిన తరువాత  జిల్లా కేంద్రం లోనీ పోలిస్ పరేడ్

మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  స్టాల్స్ ఏర్పాటు, పరేడ్ మైదానంలో బందోబస్తు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర

ఏర్పాట్ల పై సమీక్షించారు. రేపటి పాతాకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  డాక్టర్ కె.వి రమణ చారి (రిటైర్డ్ ఐఏఎస్)  విచేస్తున్న సందర్భంగా ఏర్పాట్ల పై సమీక్షా నిర్వహించారు. పాతాకావిష్కరణ అనంతరం స్టాల్స్ ల పరిశీలన,

కలెక్టరేట్ లో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ కకార్యక్రమం లో అదనపు యస్పి భరత్, అర్దిఒ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post