తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు స్థానిక అంబేద్కర్ భవన్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఈ కవి సమ్మేళనాని ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు స్థానిక అంబేద్కర్ భవన్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఈ కవి సమ్మేళనాని ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పాల్గొన్నారు

అంబేద్కర్ భవన్

జూన్ 2

అలరింపజేసిన తెలంగాణ స్ఫూర్తి కవి సమ్మేళనం

  1.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు స్థానిక అంబేద్కర్ భవన్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఈ కవి సమ్మేళనాని ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 30 మంది కవులు తమ సందర్భోచిత కవితా వచనాలతో సమ్మేళనానికి వన్నెలద్దారు. ఒకరికొకరు దీటుగా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ సాహితీ పిపాసుల మనసులను రంజింపజేశారు.

హనుమకొండ కవుల కవితా ఝరి అలుపెరుగని ప్రవాహంలా రాత్రి వరకు కొనసాగింది. తెలంగాణ ఉద్యమ ప్రాశస్త్యం, పోరుబాటలో ఉమ్మడి వరంగల్ జిల్లా పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు వీనులవిందుగా తమదైన రీతిలో కవితాత్మకత ధోరణిలో అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో సాహితీ రంగం పోషిస్తున్న పాత్ర గురించి విడమరచి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు జిల్లా లోని అంబేద్కర్ భవన్ లో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. జ్యోతి ప్రజల్వన గావించి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వచీఫ్ విప్ మాట్లాడుతూఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలను నిర్వహించుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కవి సమ్మేళనం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. ఎంతో గొప్పదైన తెలంగాణ భాషా సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని సాహితీవేత్తలు దశదిశలా చాటాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలని కవులకు పిలుపునిచ్చారు. కాళోజి కాలక్షేత్రం త్వరలోనే పూర్తి అవుతుందనీ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హనుమకొండ శరవేగం తో అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.నాటి ఉద్యమం ఇంకా తన కళ్ళముందు కదులు తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు మాట్లాడుతూ కవితలను పుస్తకరూపం లోకి తేవాలనీ అన్నారు.తెలంగాణ రావడానికి కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించిరని అన్నారు.

శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ కవులు, రచయితల ప్రభావం తనపై ఎంతో ఉందని అన్నారు. వారితో తనకు చక్కని అనుబంధం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం లో కూడ చైర్మన్ సౌందర్ రాజన్, DRO

వాసూచంద్ర, పీడీ DRDA శ్రీనివాస్ కుమార్ DPO జగదీశ్వర్ ప్రముఖ కవులు V.R విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, దేవులపల్లి వాణి, తిరునగరి నరేందర్, రజిత, శంకేసి శంకర్ రావు, రామ రత్న మాల, కొమ్మిడి గోవర్ధన్, పెద్ది వెంకటయ్య, వకుళ వాసు, వాల్స పైడి,గుల్ షన్,nvn చారి, బిళ్ళ మహేందర్, ముత్యాల రఘుపతి, కార్తీక రాజు శనిగరపు రాజమోహన్, మాసూద్ మీర్జా, ఆసనాల శ్రీనివాస్, బండారు సుజాత,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కవులను శాలువా, మెమంటో, ప్రశంశ పత్రాలతో ఘనంగా సత్కరించారు.             

Share This Post