తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో “స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021” పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
18 .10.2021
వనపర్తి .

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 లో భాగంగా ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ కోర్సు పూర్తి చేసే వారి నూతన ఐడియాలను సబ్మిషన్ చేసుకొనుట గాను పోస్టర్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం 84 పాఠశాలల నుండి 297 రాష్ట్ర టీం లో పాల్గొని 171 మంది విద్యార్థులు తమ ఐడియాలను రాష్ట్ర స్థాయి కి పంపించడం జరిగింది. ఇందులో రాష్ట్రస్థాయికి ఏడు వేల ఒక వంద ప్రాజెక్టుల నుండి ఉత్తమమైన 25 ప్రాజెక్టులు ఎంపిక చేయగా అందులో వనపర్తి జిల్లా లోని జడ్పీ హైస్కూల్ బాలురు వీపనగండ్ల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది అని అన్నారు. ఈసారి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుని ఉత్తమంగా నాణ్యమైన ఆవిష్కరణల ఐడియాలు పంపాలని కలెక్టర్ కోరారు. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఈవో రవీందర్ అధికారులు పాల్గొన్నారు..

…. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

 

Share This Post