తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ స్ఫూర్తి దాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 6:–
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ స్ఫూర్తి దాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.

శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీరా రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతను చాటి చెప్పి, తన ప్రసంగాలతో అందరిని కార్యోన్ముఖలను చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తెలంగాణ వాదం పట్ల, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల సామాన్య ప్రజలకు సైతం అవగాహన కల్పించడంలో జయశంకర్ పాత్ర అమోగమని అన్నారు

జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి దాత యని, రాష్ట్ర సాధన కోసం తపించి శ్రమించిన జయశంకర్ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post