తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన తేదీ: 8-9-2021
నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం నాగనూల్ చెరువులో 4 లక్షల చేప పిల్లలను వదిలారు. ఇందులో బొత్స్య, రొహు, మ్రిగాల వంటి చేపలు ఉన్నాయి. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారు ఆర్థిక సాధికారత సాధించలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని కుల వృత్తుల వారిని ప్రిత్సహిస్తూ మత్స్యకారులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం సబ్సిడీ పై చేప పిల్లలను చెరువుల్లో వదలడం పెద్దయ్యాక వాటిని అమ్ముకోడానికి వలలు, ఆటోలు వంటి ఇచ్చి మార్కెట్ ను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. యాదవులు 90 శాతం సబ్సిడీ పై గొర్రెలు ఇవ్వడం జరిగిందని, రజకులు ఐరన్ బాక్సులు ఇవ్వడం దోబీ ఘాట్లు నిర్మించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. నాగర్ క్షర్నూల్ జిల్లాలో ఈ సంవత్సరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 721 చెరువుల్లో రూ. 1.65 కోట్ల ఖర్చు తో 241 లక్షల చేప పిల్లలను వంద శాతం రాయితీ పై వదలడం జరుగుతుందన్నారు. జిల్లాలో సమీకృత మార్కెట్ వెజిటబుల్, నాన్ వెజిటబుల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేత సమీకృత మెసర్కెట్, వైద్య కళాశాల శంఖుస్థాపన లకు ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పన, ఏ.డి లక్ష్మప్ప, జడ్పిటి శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబూరావు, ఈశ్వర్ రెడ్డి, మత్స్యకార సహకార సంఘ నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post