తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరం.

ప్రచురణార్థం
తేది 30-1-2023
నాగర్ కర్నూల్ జిల్లా.
గా మారింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 50 కంటి వైద్య బృందాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శిబిరానికి వచ్చే వారికి కంటి పరీక్షలు నిర్వహించి దగ్గర చూపు అద్దాలు అయితే వెంటనే ఇచ్చి పంపుతున్నారు. అదే దూరం చూపు సమస్య లేదా దగ్గర దూరం సమస్యలు ఉన్నవారికి వారి పూర్తి వివరాలకు తీసుకొని వారికి సరిపడా కంటి అద్దాల కై ఆన్లైన్ లో వివరాలు నిక్షిప్తం చేసి అద్దాల తయారీకి పంపిస్తున్నారు. అద్దాలు తయారయ్యాక ఎవరి కంటి అద్దాలు వారికే ఇచ్చేవిధంగా క్యూ ఆర్ కోడ్ తో కూడిన నెంబర్ తో 15 రోజుల్లో ఇంటికే వెళ్లి ఆశ వర్కర్ ద్వారా అందించడం జరుగుతుంది.
సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని నాగనూల్ 5వ వార్డు రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించగా అదే గ్రామానికి చెందిన ఒట్సు శివలీల భర్త ఒట్సు శ్రీను ను కంటివేలుగు పై ఆమె అభిప్రాయం తీసుకోగా తన సంతోషాన్ని వెల్లడించింది. వివరాలు ఆమె మాటల్లోనే..
నేను మా ఆయన కూలి పని చేస్తాము. సంవత్సర కాలం నుండి తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందని, చేతిలో డబ్బులు లేక ఎక్కడా దవాఖానలో చూపించుకోలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేదలకు ఒక పెద్దకొడుకు, ఒక తండ్రి లాగా కంటివేలుగు క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఇస్తున్నాడని ఆయన సల్లగా ఉండాలని దీవించారు. నాకు తల్లీ తండ్రులు లేరని, భర్త తాగుతాడాని నా గురించి పట్టించుకోడని అందుకే నెత్తి నొప్పిని భరిస్తూ పనిచేస్తున్న అన్నది. తనకు ఎడమ కంటి మైనస్ ఒకటి కుడి కంటికి మైనస్ 2.5 ఉన్నాయంట, అన్ని పరీక్షలు చేసి రాసుకున్నారు. కంటి మందు ఇచ్చినారు కంటి అద్దాలు ఇంటికే తెచ్చిస్తాము అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని అద్దాలు వచ్చాక నా నెత్తినొప్పి పోతే కె.సి.ఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా.
ఒట్సు శివలీల,
నాగనూల్
మంతటి కాశమ్మ మాట్లాడుతూ తనకు దగ్గరి చూపు సరిగ్గా కనపసదని, సూదిలో దారం వేయలేను దగ్గరి వస్తువులు సరిగ్గా కనపడక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 65 సంవత్సరాల తనకు ఇంట్లో ఎవరూ పట్టించుకోరని, ఇక్కడ కంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు రమ్మని ఆశ వర్కర్ చెబితే వచ్చనన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారని కంటి అద్దాలు పెట్టుకుంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని మురిసిపోయారు. ఊళ్ళల్లో ఇలా కంటి వైద్య శిబిరాలు పెట్టి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే ఇలాంటి మంచికార్యక్రమలు అయితున్నాయని సంతోషం వెలిబుచ్చారు.
మంతటి కాశమ్మ
భర్త లింగయ్య, నాగనూల్

Share This Post