తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 29న ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన “ధరణీ పోర్టల్” నేటికి దిగ్విజయంగా సంవత్సరకాలం పూర్తి చేసుకొని రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా వ్యవసాయ భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను మరింత సులువుగా జిల్లా ప్రజలకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

అక్టోబరు 29,ఖమ్మం –

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 29న ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన “ధరణీ పోర్టల్” నేటికి దిగ్విజయంగా సంవత్సరకాలం పూర్తి చేసుకొని రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా వ్యవసాయ భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను మరింత సులువుగా జిల్లా ప్రజలకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ధరణీ పోర్టల్ ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఖమ్మం జిల్లాలో గత ఏడాదికాలంగా అందించిన ధరణి సేవలు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది కాలంలో 26 022 లావాదేవీలు జరిగాయని, వాటిలో 12,264 క్రయ విక్రయాలు 7,735 బహుమతి డీ డ్ లు , 2,944 వారసత్వ బదిలీలు, 3,079 మార్టిగేజ్ లు లావాదేవీలను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించి 8,863 పెండింగ్ మ్యుటేషన్లు, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యూటేషన్స్ కు   సంబంధించి 2,759, అదేవిధంగా పి.ఓ.బికు సంబంధించి 5,666, కోర్టు కేసులకు సంబంధించి 185 ఫిర్యాదులను పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 7 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా గతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్ సేవలను ప్రతి మండల కేంద్రం నుండే ప్రజలకు అందించేందుకు తహశీల్దార్లకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించడం ద్వారా  జిల్లాలోని 21 జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా వ్యవసాయ భూ క్రయ విక్రయాలు, మ్యుటేషన్ల రిజిస్ట్రేషన్లు అతి స్వల్ప వ్యవధిలో సులువుగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గత ఏడాది కాలంలో ధరణీ పోర్టల్ సేవలను ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించామని, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ యంత్రాంగం మొదటి రోజు నుండే కష్టపడి పనిచేయడం ద్వారా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా, పౌరులకు ప్రధానంగా ప్రవాస భారతీయులకు ధరణీ పోర్టల్ సేవలను మరింత సులువుగా అందించగలిగామని కలెక్టర్ తెలిపారు. ధరణీ పోర్టల్ సేవల వలన ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు టైటిల్ గ్యారంటీ లభించిందని, జిల్లాలో ఇప్పటివరకు 487 ఎల్.ఫారాలు జారీచేయడంతో పాటు 249 రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ధరణీ పోర్టల్ సేవలను ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు ప్రత్యేక బృంధాలు మన రాష్ట్రంలో పర్యటిస్తూ అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ధరణీ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్చేసి ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను అందించి అభినందించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాధ్, మధిర, చింతకాని, సత్తుపల్లి తహశీల్దార్లు డి. సైదులు, డి. తిరుమలచారీ, మీనన్, ధరణీ పోర్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post