తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లలో ప్రతి మంగళవారం లభించే సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు సూచించారు.

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం

( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ )

పత్రిక ప్రచురణ

తేదీ: 21/03/2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లలో ప్రతి మంగళవారం లభించే సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు సూచించారు. ఈరోజు హసన్పర్తి మండలంలోని సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి మంగళవారము 50 మంది మహిళలకు తగ్గకుండా పరీక్షించాలని మహిళలకు 8 ఆరోగ్య సమస్యలపై అవగాహన కూడా కలిగించాలన్నారు. సంబంధిత కేసు షీటులో ఉన్న అంశాలను పరిశీలించారు. పరీక్షల కోసం వచ్చిన వారి సమస్య లను తెలుసు కొని అలాగే ఆన్ లైన్ లో పరీక్షల కోసం వచ్చిన మహిళల వివరాల నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఇంకా అవసరమైన పరీక్షల కోసం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి హనుమకొండ కు పంపిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ పద్మారాణి తెలిపారు. రాష్ర్ట పరిశీలకులు శ్రీ. నంద కిశోర్, ఆప్తలమిక్ అధికారి రవీందర్ రెడ్డి, సూపర్ వైసర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post