తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరములను ప్రజలు వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు సూచించారు.

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం

( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ )

పత్రిక ప్రచురణ మరియు ప్రసార నిమిత్తము తేదీ: 23/03/2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరములను ప్రజలు వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు సూచించారు. ఈరోజు

యూ‌పి‌హెచ్‌సి బోడగుట్ట పరిధిలోని వెంకటేశ్వర పాఠశాల మరియు వడ్డేపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో పాటు మెప్మా, మున్సిపల్ సిబ్బంది క్యాంపు లు నిర్వహిస్తున్న వివరాలను తెలియచేసి ప్రజలను పరీక్షలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలు వచ్చిన తరువాత సంభoదిత వ్యక్తులకు అంద చేయాలన్నారు. అలాగే క్యాటరక్ట్ తో పాటు ఇతర సమస్యలున్న వారి వివరాలు నమోదు చేయాలన్నారు. సంభoదిత ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పని చేయాలన్నారు. అలాగే వైద్య అధికారులు మరియు సిబ్బందితో ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు, కంటి అద్దాముల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. సూపర్ వైసర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి

హనుమకొండ జిల్లా

జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.

Share This Post