తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.  సోమవారం ఉదయం మహాబూబ్ నగర్ నుండి వెబ్ ఎక్స్ ద్వారా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు,  జడ్పి చైర్మన్లు, శాసన సభ్యులు, జిల్లా అధికారులు, మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో జూన్, 3 నుండి ప్రారంభం కానున్న 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ పై సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ఇందులో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.  జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతి మండలంలో రెండేసి క్రీడా ప్రాంగణాలను ప్రారంభోత్సవం చేసుకోవాలని తెలియజేసారు.  3వ తేదీ నుండి జరిగే పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో  గ్రామాల్లో, వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి పాదయాత్ర లు చేయాలన్నారు.  పారిశుధ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  సేకరించిన తడి చెత్తను  సెగ్రిగేషన్ షెడ్ లో  సేంద్రియ ఎరువుగా మార్చి, హరితహారం మొక్కలకు వాడటమే కాకుండా రైతులకు అమ్ముకొని ఆదాయం పొందాలన్నారు.  జిల్లాలోని అన్ని సెగ్రిగేషన్ షేడ్లు, వైకుంఠ దామాలను ఉపయోగం లోకి తీసుకురావాలని తెలియజేసారు.  ప్రతి వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్ కు విద్యుత్ సౌకర్యం, తాగునీరు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.  అన్ని గ్రామ పంచాయతీల్లో, వార్డులో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అందులో తెలంగాణ వచ్చాక గ్రామ పంచాయతీకి కల్పించిన సౌకర్యాలు అందుకు అయిన వ్యయం కనిపించేవిధంగా ఉండాలన్నారు.  ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుంది, తెలంగాణ రాక పూర్వం ఎలా ఉండేది, వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలకు స్పష్టంగా అర్ధమయ్యే విధంగా బోర్డులు పెట్టాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా  అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె నిద్రలు చేయాలని సూచించారు.  హరితహారం లో భాగంగా అన్ని పి.ఆర్. రోడ్లు, ఆర్.అండ్ బి రోడ్లు, జాతీయ రహదారిపై మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, అందులో మొదటి వరుస ఖచ్చితంగా పూల మొక్కలు ఉండాలని నిర్దేశించారు.

ఈ వెబ్ కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశానుసారం  జూన్ 2వ తేదీన ప్రారంభించుకునేందుకు ప్రతి మండలంలో రెండేసి క్రీడా మైదానాలు సిద్ధం చేసి ఉంచడమైనదని ఆ రోజు ప్రజాప్రతినిధులు ఆయా మండలాల్లో పాల్గొని క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాల్సిందిగా కోరారు.  జిల్లాలో 250 కిలోమీటర్ల రహదారిని గుర్తించడమైనదని, ఇప్పటికే రెండు వరుసల్లో మొక్కలు ఉండగా మొదటి వరుస పూల మొక్కలు టెకోమా, బోగన్ విలియా వంటి మొక్కలు నాటేందుకు   ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.  జూన్ 3వ తేదీ నుండి 15 రోజుల పాటు చేపట్టవలసిన రోజువారీ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవడం జరిగిందని, గ్రామ స్థాయి ప్రత్యేక అధికారులకు జాబితా అందజేయడం జరిగిందన్నారు.  ప్రతి గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక ప్రాణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.  అన్నీ వైకుంఠ ధమాలకు విద్యుత్, మంచి నీటి సరఫరా కల్పించి వాడకంలో కి తీసుకువచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.   జిల్లాలోని ఇరిగేషన్ స్థలాలు గుర్తించడం జరిగిందని, అన్ని ఇరిగేషన్ ఖాళీ స్థలాలలో మొక్కలు నాటేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ ద్వారా జారీ చేసిన సూచనలు తూ. చ తప్పకుండా అమలు చేస్తామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారులు, ఎంపిఓ లకు తగు సూచనలు చేసి గ్రామాలను మండలాలను బాగు చేసుకుంటామన్నారు. వైకుంఠ ధమాలు, సెగ్రిగేషన్ షెడ్లను ప్రజలు వాడుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.

స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకు ఎన్ని ఫీట్ల దూరం నుండి నాటాలో అధికారులకు సరైన దిశానిర్దేశం చేయాలన్నారు.

మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులకు పని చేసిన కొన్ని బిల్లులు రాలేదని నిరుత్సాహంతో ఉన్నారని వారి బిల్లులు త్వరగా పాస్ అయ్యే విధంగా చడాలని కోరారు.  స్పందించిన కలెక్టర్ బిల్లులు పెండింగ్ ఉంటే పంపాలని,  ఫిబ్రవరి లో రిజెక్ట్ చేసిన బిల్లులు ఈ కుబేర్ లో పెండింగ్ ఉన్నట్లు తేలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, డి.పి.ఓ లు, జడ్పి సి.ఈ.ఓ లు, అధికారులు, జడ్పిటిసి లు, ఎంపిపి లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post