తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు , కమిషన్ సభ్యులు సి.హెచ్. రాగ జ్యోతి, వై. బృందాధర రావు, ఏ. దేవయ్య, ఎ. శోభారాణి, బి. అపర్ణ, అంజన్ రావు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్.

పత్రిక ప్రకటన
తేదీ 31-7-2021
నాగర్ కర్నూల్ జిల్లా
బాల అదాలత్ అనే కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగ కొనసాగించి మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల ముందుకు వెళతామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జె. శ్రీనివాస రావు అన్నారు. శనివారం
ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, భవిషత్తులో పిల్లలకు సమస్యలు రాకుండా అరికట్టడమే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కర్తవ్యమని తెలంగాణా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వెలమ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన ఒకరోజు బాల అదాలత్ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఎ. దేవయ్య, సి.హెచ్. రాగ జ్యోతి, వై. బృందాధర రావు, ఎ. శోభ రాణి, పి. అంజన్ రావు, బి. అపర్ణ తో కలిసి బాధిత బాలల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జిల్లాలో జరిగిన బాల అదాలత్ కార్యక్రమానికి 490 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అదాలత్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులను అంశాల వారిగా వేరు చేసుకొని ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని వెల్లడించారు. చాలా మటుకు దివ్యంగులు, ఆరోగ్య సమస్యల కు సంబంధించిన ఫిర్యాదులతో వచ్చినట్లు గుర్తించడం జరిగిందన్నారు. వచ్చిన ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. మారుమూల ప్రాంతం కలిగి ఉండి మౌలిక రంగంలో వెనుకబడిన నాగర్ కర్నూల్ జిల్లాలో బాల కార్మికులు, బాల్య వివాహాలు వంటి రుగ్మతలు ఉండటం వాల్ల ఇక్కడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారి ఫిర్యాదులను పరిష్కరించాలనే ఉద్దేశం తో కమిషన్ ఈ రోజు స్వయంగా ఇక్కడకు రావడం జరిగిందన్నారు. త్వరలోనే గిరిజన ప్రాంతమైన మన్ననూరులో బాల అదాలత్ నిర్వహించనున్నారు. పిల్లల హక్కులను పరిరక్షించెందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. చిన్న తనంలో పిల్లలు ఆదరణకు నోచుకోకుండా ఉండటం, వారి హక్కులకు భంగం కలగటం, బాల్య వివాహాలు జరగటం వల్ల కేవలం వారు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వారి భవిషత్ తరాలు తద్వారా సమాజంలో ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. పిల్లల హాక్కులను కాపాడటానికి పిల్లల తల్లిదండ్రులతో పాటు జిల్లా యంత్రాంగం, పోలిస్ యంత్రాంగం కృషి చేస్తుందని, అయితే అసలు సమస్యలు ఉత్పన్నం అవుతున్న చోట ప్రత్యేక ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల హాక్కుల పరిరక్షణ కమిటి, కార్మిక శాఖ, విద్యా శాఖ, బాలల సంక్షేమ శాఖ, వివిధ సంక్షేమ శాఖలు విశేషంగా కృషి చేసినందుకు వారికి, జిల్లా యంత్రంగంగానికి అభినందనలు తెలిపారు.
అంతకు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు, చెంచులు అధికంగా ఉండి మౌలిక రంగం పరంగా వెనుకబడిన నాగర్ కర్నూల్ జిల్లాలో పిల్లలకు విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇంకా చాలా మంది విద్యకు దూరంగా ఉన్నారన్నారు. వారికి దక్కాల్సిన వారి హక్కులు నాణ్యమైన విద్య, క్రీడలు,ఆహ్లాదం తదితర సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బదియిడు పిల్లలు ప్రతి ఒక్కరు విద్యను ఆర్జించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో విద్యా శాఖ తో పాటు బాలల హక్కుల పరిరక్షణ కమిటి నిమగ్నమై ఉందని తెలియజేసారు. పిల్లలకు వారి హక్కుల పై అవగాహనా కల్పించడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిటితో పాటు స్వచంద సంస్థలు పనిచేస్తున్నాయని తెలియజేసారు. కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు. కార్యక్రమం అనంతరం కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ శాలువా మేమేంటోలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, సి.డబ్లు.సి. అధ్యక్షులు లక్ష్మణ్ రావు, డి.సి.పి.ఓ ఇంతియాజ్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా అధికారులు, అంగన్వాడి టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారి.

Share This Post