తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అకాడమీ, సిరిసిల్ల మినీ స్టేడియం

తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అకాడమీ, సిరిసిల్ల  మినీ స్టేడియం , రాజన్న సిరిసిల్ల జిల్లా లో 14 సం. ల నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్థానిక బాలురకు వాలీబాల్ క్రీడలో ప్రవేశాలకై రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల యొక్క శారీరక మరియు క్రీడ నైపుణ్యాన్ని పరీక్షించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, కే ధనంజనేయులు, యాదాద్రి భువనగిరి జిల్లా  గారు తెలిపారు.
 19.09.2022 & 20.09.2022 నాడు స్థానిక సిరిసిల్ల  మినీ స్టేడియం , రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఉదయం 9.00 గంటలకు ఎంపిక నిర్వహించబడును.
అర్హతలు :   1. తేది: 01-09-2006 నుంచి 01-09-2008 మధ్య జన్మించి ఉండాలి.
2. 14 సం. ల నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న బాలుర ఎత్తు
    182 సెం.మీ. పై  బడి  ఉండాలి.
ధ్రువ పత్రాలు:  జనన ధ్రువీకరణ పత్రం,  ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ( ఒరిజినల్ & జిరాక్స్ ) తీసుకరావలెను.
శాట్స్ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు  నేరుగా సంబంధిత ధ్రువ పత్రములతో (original & Xerox) మరియు టీషర్ట్, నిక్కర్ & షూ వేసుకొని 19.09.2022 & 20.09.2022 నాడు సిరిసిల్ల  మినీ స్టేడియం , రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఉదయం 9.00  గంటలకు హాజరు కావలెను. ఎంపికైనవారికి ఉచిత భోజనం, శిక్షణా మరియు వసతి సదుపాయం ఉంటాయి.

Share This Post