తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను  మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో ఒకటని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ప్రతీక్ జైన్ అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను  మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో ఒకటని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ప్రతీక్ జైన్ అన్నారు.  బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 3 వరకు  తీరొక్క రీతిన తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు జిల్లా వ్యవసాయశాఖ,విద్యాశాఖ ల ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ ఆవరణలో  ఏర్పాటు చేసిన బతుకమ్మలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి  పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మల చుట్టూ  మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి  ఉషారు కలిగించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత  విలువిచ్చి  అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. సంప్రదాయబద్దంగా  జరుపుకునే బతుకమ్మ సంబురాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Share This Post