తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన మొదటి యోధుడు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ – అదనపు కలెక్టర్- ఎస్. మోతిలాల్

పత్రిక ప్రకటన
తేదీ 27.09.2022

నాగర్ కర్నూలు జిల్లా

* తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన మొదటి యోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు- అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్*

తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు కృషిచేసి ఆదర్శంగా నిలిచిన పోరాట యోధుడు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్ అన్నారు
మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఎస్. మోతిలాల్ మాట్లాడుతూ……
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్, మునుగోడు, భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరియు రెండు సంవత్సరాలు మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు అని ఆయన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ను రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీలో చర్చలు జరిగిన సందర్భంలో తెలంగాణ ఇవ్వడానికి సమతంగా లేనప్పుడు ఆయన ఈ పదవులు నాకు వద్దు అని అక్కడే రాజీనామా చేసి తెలంగాణ వచ్చేవరకు నేను ఎలాంటి పదవులు స్వీకరించను అని శపథం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సమావేశాలు ఏర్పాటు చేసుకొనుటకు తన యొక్క ఆస్తులు మొత్తం కూడా దానం చేసిన త్యాగశీలి వారి యొక్క పోరాటపటమని త్యాగాన్ని మన భారతీయులకు అందించాలంటే అన్ని కులాలని మతాలని వర్గాలని అందరిని కలుపుకొని మన పిల్లలకు కూడా వారి యొక్క త్యాగాన్ని తెలియజేసినట్లయితే వారికి మనము ఘనమైన నివాళులు అర్పించినట్లు అని అదనపు కలెక్టర్ శ్రీ ఎస్ మోతిలాల్ అన్నారు.
వారి యొక్క త్యాగాలను స్మరిస్తూ మన భావి తరాలకు అందించడానికి మనము అందరం కూడా మన వంతు కృషిచేసి వారి యొక్క పోరాటపటిమను, తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో భాగమై ముందుకు సాగాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post