ప్రచురణార్థం
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది…… జనగామ, సెప్టెంబర్- 27.
స్వతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవంలో కలెక్టర్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, స్వాతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొని, తన దేశభక్తిని చాటుకున్నారని, అలాగే తెలంగాణ కోసం ఉద్యమించి ఉద్యమకారులతో సత్యాగ్రహాలు, దీక్షలు లాంటివి ఆయన పోరాటం స్ఫూర్తికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు’