తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి…

ప్రచురణార్థం

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 9.

తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర నిర్వహించి పోరాటానికి ఉద్యమ ఊపిరిలూదిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని జిల్లా కలెక్టర్ శశాంక కొనియాడారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ పరిపాలన అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కాలేజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్ర సాధన లో ఉద్యమానికి ఊపిరిలూదిన మహోన్నతమైన వ్యక్తి అని అందుకొరకే ప్రభుత్వం అధికారిక కార్యక్రమం గా నిర్వహిస్తున్న దని తెలిపారు

తెలంగాణ భాష యాస పై రకరకాలుగా ప్రచారం అవహేళన వంటి కార్యక్రమాల సందర్భంలో మా భాష తెలుగు భాష ఇతర ప్రాంతాల కంటే స్వచ్ఛమైనది మమకారం ఉన్నది అని ఎలుగెత్తి చాటారు.
అన్యాయం ఉన్నచోట అది ప్రభుత్వమైనా పోరాటం చేయడమే తృప్తిని ఇస్తుందని అలాగే అన్యాయాన్ని ఎదిరించే వారు దైవ స్వరూపమని తనకు పోరాడేవారు ఆరాధ్య దైవం అని భావించేవారని కలెక్టర్ తెలియజేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చేపట్టిన ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినట్లు తెలియజేశారు కాళోజి త్యాగాలను ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ్ బిరుదులు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
గొప్ప వ్యక్తుల ఆశయాల సాధన అనుగుణంగా మనందరం కూడా నిరంతరం కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవా లన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య కార్యాలయ పరిపాలన అధికారి వెంకటరమణ కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post