తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్నిప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,

 అన్ని దానాల్లో కెల్లా రక్త దానం మిన్న

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

              o0o

రక్తదానం ప్రాణదానంతో సమానం అని అన్ని దానాల్లో కెల్లా రక్త దానం మిన్న అని జిల్లా కలెక్టర్ ఆర్ .వి  కర్ణన్ అన్నారు.

     మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్  అసోసియేషన్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో  ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి  అయన ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం మహాదానం అని అన్నారు. తరచుగా జరుగుచున్న ప్రమాదాలలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక ఎంతో మంది మరణిస్తున్నారని, ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించుటకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆరోగ్యవంతులైన వారు రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్  అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గా వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన  ఈ రక్తదాన శిబిరంలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు,రెవెన్యూ సిబ్బంది దాదాపు వందమంది రక్తదానం చేశారు.

Share This Post