తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక యైన బతుకమ్మ పండుగను ప్రమాదాలకు తావు లేకుండా  ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ప్రజలకు సూచించారు.

రేపటి నుండి బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతున్నందున జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు  తెలిపారు. జిల్లాలో రేపటి నుండి  బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్నదని, నేటి నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను రక రకాల పూలతో బతుకమ్మలు పేర్చి ఆట, పాటలతో ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. బతుకమ్మ ఆట పాటలు పూర్తయిన తదుపరి బతుకమ్మను నీటిలో నిమజ్జన చేస్తారని, నిమజ్జన సమయంలో ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు, డ్యాంలు పూర్తిస్థాయి నీటి మట్టంతో సంపూర్ణంగా నిండి ఉన్నాయని, నీటిలోకి వెళ్లకుండా వడ్డు  నుండే బతుకమ్మను నీటిలో వదిలే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని  చెప్పారు. నిమజ్జన ఘాట్ల వద్ద మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఘాట్లను తహసిల్దార్, యంపిడిఓ, యంపిఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Share This Post