తెలంగాణ సంస్కృతిక చిహ్నం బతకమ్మ పండుగ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

తెలంగాణ సంస్కృతిక చిహ్నం బతకమ్మ పండుగ

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

     తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచేది బతకమ్మ పండగ అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

సోమవారం రాత్రి జ్యోతిబా పూలే( సర్కస్ గ్రౌండ్)లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వశక్తి బతకమ్మ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ పండుగ అని, బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ బతకమ్మ పండుగ అన్నారు.   అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, పీడీ మెప్మా బి రవీందర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post