తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని పెంచేందుకు పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని పెంచేందుకు పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సోమవారం మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండల పరిధిలోని సామ నరసింహ్మ రెడ్డి గార్డెన్ లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మహిళల కు చీరలు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు . ప్రపంచంలో నే పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణ రాష్ట్రం లోనే ఉందని, దసరా ఉత్సవాల్లో భాగంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉందని మంత్రి అన్నారు.
అన్ని పండుగలను గౌరవిస్తూ, అందరిని సమానంగా చూస్తూ కానుకలు అందిస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి అన్నారు. బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్ కు తోఫాలు,క్రిస్మస్ కు గిఫ్ట్ లు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యావత్ తెలంగాణ ప్రజలు ఆశీర్వాదాలు అందిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 19 రంగులు,17 డిజైన్ల తో 29 వర్ణాలతో సరికొత్తగా చీరలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 318 కోట్ల రూపాయల తో ఒక కోటి 8 లక్షల చీరలు పంపిణీ కి సిద్ధం చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 28 వేల 154 మందికి చీరల పంపిణీ చేస్తున్నామన్నారు. కందుకూరు మండలానికి 19 వేల మందికి చీరలను పంపిణి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి 18 ఏళ్ళు వయస్సు నిండిన యువతులు, మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రతి ఏటా మహిళలకు పుట్టింటి కానుకగా అందిస్తున్న చీరల వెనుక నేతన్నల కష్టం ఉందని , చేనేత కార్మికుల ఆకలి చావులు,ఆత్మహత్యలు రూపుమాపుతూ, వారికి ఆరు నెలల పని కల్పిస్తూ,సుమారు 10 వేల మంది నేత కార్మికులు 16 వేల మగ్గాలపై తయారు చేసిన చీరలను నేడు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల కు పంపిణీ చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ తో ఇంటింటికి నల్లా ఇచ్చి మహిళల కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ మహిళ లోకం తరుపున ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ లతో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కేసీఆర్ కిట్ లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు..ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరిగితే అమ్మాయి పుడితే 13 వేలు,అబ్బాయి పుడితే 12 వేలు అకౌంట్ లలో జమ చేస్తున్నదని మంత్రి తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహించటానికి రాష్ట్రంలో కెజిబివిలను ఏర్పాటు చేసి విద్యను అందిచడం జరుగుతుందని అన్నారు. కందుకూరు మండల మహిళా సమాఖ్య సభ్యులకు 15 కోట్ల 74 లక్షల 45 వేల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు.
అనంతరం మహేశ్వరం మండల పరిషత్తు సమావేశ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పాల్గొని మహిళల కు చీరలు పంపిణీ చేసారు. మహేశ్వరం మండలానికి 16 వేల 545 మందికి చీరలను పంపిణి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి , డిఆర్డిఏ పిడి ప్రభాకర్, ఆర్డీఓ వెంకటా చారి , జడ్పీటీసీ జంగారెడ్డి , ఎంపీపీ జ్యోతి, మార్కెట్ చైర్ పర్సన్ వరలక్ష్మి , ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post