తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచేది బతకమ్మ పండగ- జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచేది బతకమ్మ పండగ అని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.

బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన బుధవారం టి.యన్.జి.ఓ, టి.జి.ఓల ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బతకమ్మలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ పాల్గొని ఎఓ ప్రమీలతో కలిసి పూజ చేసి మహిళల ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ హరిప్రియ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ పండుగ అని, బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ బతకమ్మ పండుగ అన్నారు.  మహిళా స్వావలంబన చెందాలనే గొప్ప ఆశయం బతుకమ్మ సంబరాలలో ఉందనీ, బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని  కొనియాడారు. తెలంగాణ మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అని అన్నారు. మహిళలు స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో, ఆత్మగౌరవంతో బతుకాలనే సందేశం బతుకమ్మ ఆటలో ఉందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్యామ లక్ష్మీ, జిల్లా విద్యశాఖ అధికారి సూసిందర్ రావు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post