తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ – డిఆర్ ఓ హరిప్రియ

మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేటులో జిల్లా సంక్షేమ  శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు  నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా రెవిన్యూ అధికారి ( డి ఆర్ ఓ ) హరిప్రియ పాల్గొని పూజ చేసి, వేడుకలలో ఆడి పాడారు.

ఈ సందర్బంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలను కనుమరుగు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, ప్రపంచంలో ఎక్కడాలేని పూల పండుగ మన రాష్టంలో బతుకమ్మ పండుగని చేసుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను అందరం కలిసి  చేసుకుంటామని అన్నారు.  మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామని, అద్బుతమైన ఈ పండుగను బావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ వేడుకలలో జిల్లా సంక్షేమ  శాఖ అధికారి మోతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రత్నకళ్యాణి, సీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

Share This Post