తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఫ్రాన్స్ లో జరుగనున్న జిమ్నాసైడ్ -2022లో పాల్గొననున్నారు
ఫ్రాన్స్ లోని నార్మండిలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే అంతర్జాతీయ పాఠశాలల సమాఖ్య, ప్రపంచ పాఠశాలల జిమ్నాసైడ్ -2022 పోటీలకు ఎస్సీ గురుకులాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు
డిండి అథ్లెటిక్స్ అకాడమీలో ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థిని ఎన్.మాయావతి 100మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారు
షేక్ పేట అథ్లెటిక్స్ అకాడమీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న రవికిరణ్ జావెలిన్ త్రో, మొదటి సంవత్సరం విద్యార్థిని కె.ప్రణయ ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొంటారు
అలాగే, చింతకుంట వాలీబాల్ అకాడమీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న లావణ్య కజకిస్థాన్ లో ఈ ఏడాది జూలైలో జరిగే అండర్-20 ఏషియా వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు
సొసైటీ 24 వివిధ స్పోర్ట్స్ అకాడమీలను నడుపుతుండగా,7 గురు అంతర్జాతీయ పోటీల్లో రాణించారు
జాతీయ స్థాయిలో 107బంగారు,14వెండి,27కాంస్య పతకాలు,రాష్ట్ర స్థాయిలో 344బంగారు,234వెండి,176కాంస్య పతకాలు సాధించారు
క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు 2017-18లో 21లక్షల 33వేల,2018-19లో 33లక్షల 38వేల,2020-21లో 12లక్షల 85వేల నగదు పురస్కారాలు అందజేశారు
ఈ అకాడమీల్లో చదువుతున్న,శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.125 చొప్పున ఖర్చు చేస్తూ పోషకాహారాన్ని అందించడం జరుగుతున్నది
అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొననున్న విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు శుభాభినందనలు చెప్పారు, ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చి పతకాలతో విజయవంతంగా తిరిగి రావాలని, తెలంగాణ రాష్ట్రం తో పాటు మన గురుకులాల పేరుప్రఖ్యాతలను ప్రపంచం నలుదిశలా చాటిచెప్పాల్సిందిగా ఆశీర్వదించారు