తెలంగాణ సాంస్కృతిని ఉట్టిపడేలా చెరువుల పండగను అత్యంత ఘనంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన
తేదీ 07.06.2023

తెలంగాణ సాంస్కృతిని ఉట్టిపడేలా చెరువుల పండగను అత్యంత ఘనంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేసిన అధికార యంత్రాంగానికి కలెక్టర్ అభినందనలు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా సాధించిన ప్రగతి, అభివృద్ధి, తెలంగాణ సంస్కృతిని తెలిపేలా ఈ నెల 8వ తేదీ గురువారం ఊరూరా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రత్యేకాధికారులతో ఊరూ రాచెరువుల పండుగ కార్యక్రమ నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ….
మంగళవారం నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటనను విజయవంతంగా నిర్వహించి, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులందరికీ ఆయన అభినందించారు.
ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
9 సంవత్సరాల అభివృద్ధిలో అధికారులంతా భాగ్యస్యములైన అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించి, ప్రశంసించిన అంశాన్ని కలెక్టర్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి అందించిన స్ఫూర్తితో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించే ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభోగంగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా ప్రతి గ్రామ చెరువు కట్టెలపై నిర్వహించాలని అన్నారు.
అన్ని గ్రామాల్లోని చెరువుల వద్దకు గ్రామంలోని ప్రజలు సాయంత్రం భారీ ర్యాలీగా బతుకమ్మలు, బోనాలతో తరలివెళ్లి, కట్ట మైసమ్మకు పూజలు జరిపి, అందరూ అక్కడే భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చెరువు కట్టల వద్దకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో రావాలన్నారు.
చెరువు కట్టలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు, పాటలతో కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి హాజరైన వారందరికీ భోజన వసతి కల్పించాలని కోరారు.
నేటి సాయంత్రం లోగా గుర్తించిన ప్రదేశాలను క్లీన్‌ చేసి పెట్టుకోవాలని, అధికారులందరూ ఆ గ్రామాల్లోనే బస చేసి చెరువుల పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా చెరువుల వద్ద సాయంత్రం పూట రక్షణ కల్పించాలని పోలీస్‌, జాలర్లు, గ్రామంలో ఉన్న గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూసు కోవాలని అన్నారు. భోజనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోతిలాల్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………….. .. …………… జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడమైనది.

Share This Post