తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మజయంతి సందర్భంగా మంత్రి ఆమెకు నివాళులర్పించారు. 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మజయంతి  సందర్భంగా మంత్రి ఆమెకు నివాళులర్పించారు. 

Press Release

Date-26-02-2022

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా మంత్రి ఆమెకు నివాళులర్పించారు.

నేడు ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువ ప్రజలను ఉత్తేజ పరిచాయని అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యం లో ఆమె పోరాటాన్ని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

సీఎం కెసిఆర్ గారి చొరవతో ఐలమ్మ గారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటు న్నామని మంత్రి తెలిపారు. ఐలమ్మ పుట్టిన ఊరు, మెట్టిన ఊరు, ఆమె ఎదిరించిన నాటి దేశ్ ముఖ్ ఊరు అన్నీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం లోనే ఉండటం తమ అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Share This Post