తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 06 ఖమ్మం:
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి జంక్షన్ నందు గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, నగర మేయర్ పనుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాలులర్పించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఉద్యమాలు, విద్యార్ధి దశనుండే ఉద్యమ నాయకుడిగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలియచేసిన. అవశ్యకతమ తెలుగులో రచించిన రచనలు ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలను కొనియాడారు.
నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, వారిచే జారీచేయనైనది.

Share This Post