తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్ లోని కొత్తూరు వద్దగల ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 6:

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 88 జయంతిని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్ లోని కొత్తూరు వద్దగల ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్‌ తన జీవితాన్ని ధారపోశారని తెలిపారు. జయశంకర్ సర్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తారన్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌కు జ‌య‌శంకర్ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీకి ఆచార్య జయశంకర్ పేరు పెట్టుకున్నామ‌ని మంత్రి అన్నారు. తెలంగాణ శ్వాసగా, తెలంగాణే ధ్యాసగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్లు ఎం. వెంకటేశ్వర్లు, కె. మురళి, ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This Post