తెలంగాణ స్ఫూర్తితో కవి సమ్మేళనం – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

తెలంగాణ స్ఫూర్తితో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాత్రి నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు.
కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని, ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వ ఆదేశాలతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో సైతం కవులు, రచయితలు కీలక పాత్ర పోషించారని, రచనలతో ఉద్యమ స్ఫూర్తి నింపారని అన్నారు.
కవి సమ్మేళన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, భవిష్యత్తులో సైతం వివిధ సందర్భాలలో కవుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీని కోసం పౌర సంబంధాల అధికారి కన్వీనర్గా కమిటీ ఏర్పాటు చేసి కవులను ఎంపిక చేశామని అన్నారు.
కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై మాత్రమే సకారత్మ ధోరణిలో, 3 నిమిషాల సమయం మించకుండా కవితలు చెప్పారని తెలిపారు.నాగర్ కర్నూలు జిల్లా కు చెందిన సమయాభావం వల్ల 18 మంది కవులు ఎంపిక చేసి కవి సమ్మేళనం కార్యక్రమంలో అవకాశం కల్పించామని అన్నారు.
కవి సమ్మేళనం కార్యక్రమంలో కవులు తమ కవితలను, రచనలు గేయాలను వినిపించారు. అనంతరం కవి సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న కవులకు రూ. 2 వేల నగదు పూల మొక్కలు శాలువాతో కలెక్టర్ సత్కరించారు.
అంతకుముందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థినిలు నిర్వహించిన భారత్ మాతాకీ జై అనే నృత్యం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, డీఈవో గోవిందరాజులు, డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ తెలంగాణ కవి సమ్మేళనం కార్యక్రమం కమిటీ సభ్యులు గుడిపల్లి నిరంజన్, వనపట్ల సుబ్బయ్య, కృష్ణా రెడ్డి, కలెక్టరేట్ ఏ. ఓ.శ్రీనివాసులు, కవులు,జిల్లాఅధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post