తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు.
తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 14 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు కవులను శాలువాతో సన్మానించి రూ. 2,000/-లను పారితోషకం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీధర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటచారి, జిల్లా యువజన క్రీడల అధికారి ఈ వెంకటేశ్వర రావు, కవులు ఘంటరావం మనోహర్ రెడ్డి, గోపాల్, ఘనపురం పరమేశ్వర్, భవానీ జగదీశ్వర్ రెడ్డి, హరీష్ కుమార్ శర్మ, డాక్టర్ నన్నపురాజ్ విజయశ్రీ, రాపోలు, వెంకటేశం, దశరథ రామయ్య, పున్నే విజయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్ చారి, రవీంద్ర చారి, జి. జ్యోతి, సర్ఫరాజ్ అన్వర్, టి. ఆశీర్వాదం, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post