తెలంగాణ 5వ రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ టోర్నమెంట్స్ -యాదాద్రి భువనగిరి జిల్లా

తేది :12-11-2021 నుండి 14-11-2021 వరకు మూడు రోజుల పాటు జరిగే 5వ రాష్ట్ర స్థాయి  జూనియర్ హాకీ టోర్నమెంట్స్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో ని న్యూ డైమెన్షన్ స్కూల్ లో అట్టహాసంగా ప్రారంభించడం జరిగినది. తేది:12-11-2021 -శుక్రవారం మొదటి రోజున జిల్లా అడిషనల్ కలెక్టర్-శ్రీ దీపక్ తివారీ ఐ.ఏ.ఎస్.గారు ముఖ్య అతిధిగా హాజరై జూనియర్ హాకీ టోర్నమెంట్స్ ని ప్రారంభించడం జరిగినది. ఈ టోర్నమెంట్ కార్యమమునకు శ్రీ. దీపక్ తివారీ ఐ. ఏ.స్., అడిషనల్ కలెక్టర్ గారు, అర్జున అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్  శ్రీ.ముకేష్ కుమార్ గారు , జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి శ్రీ . కే ధనంజనేయులు గారు, యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. కిరణ్ గౌడ్ గారు, జనరల్ సెక్రెటరీ -లచ్చు గారు , ఉమ్మడి 10 జిల్లాల నుండి జూనియర్ హాకీ క్రీడాకారులు, కోచ్ లు, అనేకమంది క్రీడాకారులు హాజరైనారు. ఈ కార్యక్రమములో  శ్రీ దీపక్ తివారీ ఐ.ఏ.ఎస్. అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతూ-యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో రాష్ట్ర స్థాయి – భారత జాతీయ క్రీడ హాకీ టోర్నమెంట్స్ నిర్వహించడం  చాలా సంతోషకరం అని, హాకీ క్రీడలో భారత దేశానికి ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలబెట్టుట కొరకు క్రీడాకారులు మరియు కోచ్ లు మరింత కృషి చేయాలని, వివిద  క్రీడల పట్ల యువత ఆసక్తి కనబర్చుకొని ప్రపంచస్థాయిలలో  రాణించాలని, క్రీడల వలన మాసిక శారీరక ఉత్తేజం పొంది అటు చదువుల్లోనూ ఇటూ క్రీడాల్లోనూ రాణించ వచ్చని, శాస్త్ర సాంకేతికా – విజ్ఞానం రంగాలే కాదు   క్రీడా రంగం  ద్వారా  కూడా భారత జాతిని ఔన్నత్యాన్ని  ప్రపంచ దేశాలకు చాటి చెప్పవచ్చని కూడా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. కిరణ్ గౌడ్ గారు మాట్లాడుతూ –యాదాద్రి భువనగిరి జిల్లాలో హాకీ  టోర్నమెంట్స్  కి వేధిక కావడం జిల్లా అదృష్టం అని జాతీయ అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడలలో రాణిచాలంటే నిరంతర తర్ఫీదు , మరియు ప్రాక్టీస్ అవసరమని తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లా నుండి అనేక మంది క్రీడాకారులని జాతీయ అంతర్జాతీయ పోటీలకు ఎక్కువ మంది క్రీడాకారులను తీర్చి దిద్దుతామని -దీనికి ప్రభుత్వం నుండి మరింత సహాయం కావాలని కోరినారు. అర్జున అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్  శ్రీ.ముకేష్ కుమార్ గారు మాట్లాడుతూ పిల్లల ప్రాథమిక స్థాయి నుండే క్రీడల పట్ల అవగాహన ఏర్పరచి వారిని చదువుతో పాటు క్రీడలలో రాణించెట్లుగా విద్యాభ్యాసం సమయం లోనే  ఉపాద్యాయులు-పి.ఈ .టి. లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు . ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు -పిల్లల యొక్క మానసిక , శారీరక సామర్థ్యం ను పెంపొందించుటకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని హితవు పలికారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి  10 జిల్లాల క్రీడాకారులు , కోచ్ లు, PETలు   వివిధ యువజన సంఘాల నాయకులు , జిల్లా లోని వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు .

Share This Post