తెలుగు సాహిత్యవేత్త మహాకవి పోతన గురించి విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలని చీప్ అడ్వైజర్ ఎఫ్ టి సి సి ఐ బీపీ ఆచార్య అన్నారు

వరంగల్

తెలుగు సాహిత్యవేత్త మహాకవి పోతన గురించి విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలని చీప్ అడ్వైజర్ ఎఫ్ టి సి సి ఐ బీపీ ఆచార్య అన్నారు

మంగళవారం రోజున బీపీ ఆచార్య వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ ప్రావీణ్య తో కలిసి పోతన మ్యూజియాన్ని సందర్శించారు

ముందుగా పోతన సంగీత పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చాలు తో స్వాగతం పలికారు అనంతరం సంగీత పాఠశాల అధ్యాపకులతో కలిసి పోతన విగ్రహానికిబీపీ ఆచార్య పూలమాల వేశారు
అనంతరం బీపీ ఆచార్య మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి… పదవి విరమణ పొంది ఉన్నానని..3 సంవత్సరాల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా పని చేసిన కాలంలో స్పెషల్ గ్రాంట్ కింద 01 కోటి రూపాయలు మంజూరు చేసనని…కలెక్టర్ గా ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో పోతన విజ్ఞాన కేంద్రాన్ని పెట్టాలనే ఉద్దేశంతో మెమోరియల్ ట్రస్ట్ సభ్యులతో కలిపి మందిరం కట్టడం జరిగిందని అన్నారు

కాలక్రమేణా అది శిథిల స్థితికి చేరుకుందని చెప్పారు కొత్త జనరేషన్ కు మదిని దోచే విధంగా హైదరాబాద్ డిజిటల్ ఆర్టిస్టులతో సమన్వయం చేసుకొని వరంగల్ లాంటి నగరంలో పోతన మ్యూజియం నెలకొల్పడం జరిగిందని…ప్రజలలో మహాకవి పోతన గురించి గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు బాలబాలికలు పాల్గొన్నారు

Share This Post