తేది.01.09.2021. హనుమకొండ. దళిత బంధు ఇంటింటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

ప్రెస్ రిలీజ్.
తేది.01.09.2021.
హనుమకొండ.

దళిత బంధు ఇంటింటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దళిత బంధు ఇంటింటి సర్వే పై క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజక వర్గం లోని కమలాపుర్ మండలంలోని గ్రామాలను 12 క్లస్టర్లు విభజించడం జరిగిందని 12 మంది జిల్లా అధికారులను, 32 బృందాలకు స్పెషల్ ఆఫీసర్స్ నియమించి దళిత బంధు ఇంటింటి సర్వే పూర్తి చేశామని అన్నారు. దళిత బంధు పధకం కింద కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని , అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి క్లస్టర్ అధికారులు డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్,అడిషనల్ డి ఆర్డీఓ శ్రీవాణి, డిపిఓ జగదీశ్వర్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, డిఎండబ్లుఓ శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ హరిప్రసాద్, డిబిసిడబ్లుఓ రాంరెడ్డి, ఈడిఎస్సి కార్పొరేషన్ మాదవిలత, ఏ డి అగ్రికల్చర్ దామోదర్, డిడి గ్రౌండ్ వాటర్ శ్రీనివాస్ రావు, డిసిఓ నాగేశ్వరరావు, ఏ డి పశుసంవర్ధక శాఖ తదితరులు పాల్గొన్నారు.

Share This Post