ప్రెస్ రిలీజ్.
తేది.05.9.2021.
హనుమకొండ.
సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర ప్రభుత్వఛీప్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.
జిల్లా స్థాయి గురుపూజోత్సవాన్ని ఆదివారం నాడు హనుమకొండ కలక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ సమాజ మార్పు కోసమని అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులే నిజమైన ప్రజా సేవకులని కొనియాడారు. ఉపాధ్యయ దినోత్సవం ఒక్క రోజుకే పరిమితము కాదని, నిత్యం స్మరించుకోవాల్సిన వారు. విద్య నేర్పిన గురువులు అని అన్నారు. చిన్నప్పుడు తాను చేసిన తప్పులను సరిదిద్థి క్రమశిక్షణతో ఈస్థాయికి తీసుకుని రావడంలో ఉపాధ్యాయులది కీలకమైన పాత్ర అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకూ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. మర్కజీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1001కి చేరిందని, ఈ సంఖ్య పెరగటానికి ఉపాధ్యాయులే అని అన్నారు. శాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలిచిందని, ఈ పాఠశాల స్పూర్తితో పనిచేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సౌకర్యాలకల్పనకు తనవంతు కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర పోషించారని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల రంగం ఎన్నోమార్పులు సంభవించాయానీ, పురాణాల నుండి నేటి ఆధునిక యుగం వరకూ ఉపాధ్యాయులది అగ్ర స్థానం అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క విద్యార్ది భవిష్యత్ ను తీర్చిదిద్దే వారే ఉపాధ్యాయులు అని ఆయన అన్నారు.
విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ , సాంస్కృతిక కళాకారుల బృందం ఆలపించిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 37మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో 49 వ డివిజన్ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, డీఈఓ నారాయణరెడ్డి ఎం ఈ ఓ లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.