తేది 07.09.2021 శ్రీనిధి బకాయిల వసూళ్లు వారం రోజుల వ్యవధిలో 70 శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

[6:22 pm, 07/09/2021] P. V. Rao. DPRO, KMR.: ప్రెస్ రిలీజ్. తేది 07.09.2021 శ్రీనిధి బకాయిల వసూళ్లు వారం రోజుల వ్యవధిలో 70 శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఐకెపి అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. ప్రణాళిక ప్రకారం బకాయిలు వసూలు చేసి స్వయం సహాయక సంఘాలకు కొత్త రుణాలు ఇప్పించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ బకాయిలు వారం రోజుల వ్యవధిలో 50 శాతం లక్ష్యాలు వసూలు చేయాలని కోరారు. శ్రీ నిధి ద్వారా మహిళలు గేదెలు కొనుగోలు కోసం రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలో 700 చొప్పున లబ్ధిదారులకు గేదెలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బాన్స్వాడ లో 400 గేదెలను స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇవ్వడానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. పాల ఉత్పత్తిని పెంపొందించడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి పొందడానికి పిండి గిర్ని, దాల్ మిల్, ఆయిల్ మిల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అని పేర్కొన్నారు. శ్రీనిధి ద్వారా కామారెడ్డి మండల సమైక్య కు కంప్యూటర్, ప్రింటర్ను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, డి పీ ఎం లు, ఏ పీ ఎం లు పాల్గొన్నారు.

జిల్లాలోని 22 మండల సమాఖ్య లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యుపిఎస్ లు తో కూడిన 24 కంప్యూటర్ సెట్లు మండల సమాఖ్యలకు ఈరోజు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఏజీఎం రవి కూడా పాల్గొన్నారు. Dpro..Kamareddy.
] P. V. Rao. DPRO, KMR.:

Share This Post