తేది 09.09.202 తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 09.09.202

తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం కాళోజి నారాయణ రావు గారి జయంతి వేడుకలు నిర్వహించారు. కళోజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాషను, యాస లోని కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి గా పేర్కొన్నారు. కాళోజీ ని తెలంగాణ ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, ఏవో రవీందర్, సి పి ఓ రాజారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post