తేది 09.09.2021 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గ్రామాల సర్పంచులకు వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 09.09.2021

100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గ్రామాల సర్పంచులకు వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తన ఛాంబర్లో టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో 80% వ్యాక్సినేషన్ జిల్లాలో పూర్తిచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల వారీగా ఆరోగ్య కార్యకర్తలు తమ లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలన్నారు. కరోనా కేసులు వస్తున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ విస్తరించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కామారెడ్డి డివిజన్ లో ఇప్పటి వరకు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెప్పారు. ఎల్లారెడ్డి డివిజన్లో 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.

టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ అజయ్ కుమార్, ఎల్లారెడ్డి, బాన్సువాడ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ వో లు శోభారాణి, మోహన్ బాబు, వైద్యులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post