తేది 09.11.2021 రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆధునిక సౌకర్యాలతో బీబీపేట ఉన్నత పాఠశాల నిలిచిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

ప్రెస్ రిలీజ్. తేది 09.11.2021 రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆధునిక సౌకర్యాలతో బీబీపేట ఉన్నత పాఠశాల నిలిచిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీబీ పేటలో మంగళవారం ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సొంత ఊరు పై మమకారంతో సుభాష్ రెడ్డి గ్రామపంచాయతీ, పాఠశాల భవన సముదాయం నిర్మించారని కొనియాడారు. పుట్టిన ఊరికి రుణం తీర్చుకునే అవకాశం కొందరికే ఉంటుందని అలాంటి వారిలో సుభాష్ రెడ్డి ఒక్కరిని చెప్పారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మన వంతు ఉడతాభక్తిగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యం వంటి రంగాలను అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కోనాపూర్ లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉచ్చతర ప్రాథమిక పాఠశాలగా మార్చడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… జనగామ, బీబీపేట గడ్డ సుభాష్ రెడ్డి తో ధన్యమైందని చెప్పారు. ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాల గా అప్ గ్రేడ్ చేయడానికి రాష్ట్ర మంత్రుల సహకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… సుభాష్ రెడ్డి, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలల నిర్వహణకు కార్పస్ ఫండ్ జమ చేయడం గొప్ప విషయమన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. పాఠశాల కార్పస్ పండ్ కు రూపాయలు 11 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ..చిన్నతనంలో కష్టాలు ఎదుర్కొని, సొంత కృషితో సుభాష్ రెడ్డి వ్యాపారవేత్తగా ఎదిగారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సహకారంతో కోటి 20 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. తన వంతుగా పాఠశాలకు మూడు లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్పు గొంగడి సునిత, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, ఎమ్మెల్సీలు రఘోత్తమరెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీపీ బాలమణి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post