ప్రెస్ రిలీజ్. తేది 12.08.2021 దళిత వాడ, గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించడానికి అవసరమైన ప్రతిపాదనలు ఈ నెల 13లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.
గురువారం తన చాంబర్లో దళిత వాడలు, గిరిజన తండాల్లో కల్పించవలసిన మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా తాగునీరు, మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సమస్యలపై తీర్మానాలు తయారుచేసి సర్పంచుల సంతకాలతో సహా ప్రతిపాదనలు రేపటి లోగా సమర్పించాలని, మండల, జిల్లాస్థాయిలో బుక్ లెట్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, డిపివో సునంద, సీఈవో సాయ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానందరావు, ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మీనారాయణ, ట్రాన్స్ కో సూపరింటెండింగ్ ఇంజనీర్ శేషారావు, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.