తేది 12.08.2021 భవనాల నిర్మాణానికి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ భవనాలు నిర్మించే వ్యక్తులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఎన్ఫోర్స్మెంట్ టీములను ఆదేశించారు.

ప్రెస్ రిలీజ్. తేది 12.08.2021 భవనాల నిర్మాణానికి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ భవనాలు నిర్మించే వ్యక్తులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఎన్ఫోర్స్మెంట్ టీములను ఆదేశించారు.

గురువారం నాడు తన ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న నాలుగు TS B Pass ఎన్ఫోర్స్మెంట్ టీముల తనిఖీ నివేదికలను ఆయన సమీక్షించారు. పట్టణాల్లో పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, స్వీయ ధృవీకరణ ద్వారా పర్మిషన్ తీసుకొని దానిని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు కమిటీ దృష్టికి వచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారిపై చర్యలు తీసుకోవాలని, నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం జరిమానాలు వేయాలని, నిర్మాణాలను, సీజ్ చేయాలని ఆదేశించారు. జరిమానాలు, నిలుపుదల చేసినా కూడా తిరిగి నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తామని హెచ్చరించాలన్నారు. మున్సిపల్, ఆర్ అండ్ బి రోడ్లను ఆక్రమించి భవనాలు నిర్మించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అనుమతి లేకుండా మున్సిపల్ పరిధిలో ఎవరైనా భవనాలు నిర్మిస్తే వాటిని వెంటనే నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేపట్టాలని కోరారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, జగ్జీవన్, కామారెడ్డి , బాన్సువాడ, ఎల్లారెడ్డి డిఎస్పీలు సోమనాథం, జైపాల్ రెడ్డి, శశాంక్ రెడ్డి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post