తేది 14.09.2021 అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములలో బ్లాక్ ల వారీగా ఉటచెరువులు, చెక్ డ్యాముల, కంటూరు కందకాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని, అటవీ రిజువనేషన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 14.09.2021 అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములలో బ్లాక్ ల వారీగా ఉటచెరువులు, చెక్ డ్యాముల, కంటూరు కందకాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని, అటవీ రిజువనేషన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం నాడు ఆయన ఫారెస్ట్ రిజువనేషన్ కార్యక్రమంపై యాక్షన్ ప్లాన్ ను అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో బ్లాకుల వారీగా స్థలాలను గుర్తించి ఉపాధి హామీ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతాల్లో ఉట చెరువులు, చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని, పచ్చదనం పెంపొందించే చర్యలతో అటవీ విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

డి ఎఫ్ ఓ నిఖిత మాట్లాడుతూ, 33 శాతం అడవులు పెంచడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

సమావేశంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే , జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post