తేది 14.09.2021 ప్రతి నెలా జిల్లాలోని ఐదు పంచాయతీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 14.09.2021 ప్రతి నెలా జిల్లాలోని ఐదు పంచాయతీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, గ్రామపంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి శుక్రవారం వాటరింగ్ డే నిర్వహించాలని అని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. సేంద్రియ ఎరువులను విక్రయించి పంచాయితీలు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ లో 20 మంది కూలీలు పని చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. జల శక్తి అభియాన్ ద్వారా గ్రామాల్లో ఉట చెరువుల, చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. శ్రమశక్తి సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో చేపట్టవలసిన ఉపాధి హామీ పనులను గుర్తించాలని సూచించారు. గ్రీన్ బడ్జెట్ ను వినియోగించి అన్ని రోడ్లలో మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవ రావు, డి పి ఓ సునంద, డి ఎల్ పి వో లు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post