తేది 14.09.2021 మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 14.09.2021 మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు.

భిక్కనూరు మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం చేపపిల్లలను వదిలిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తో పాటు జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ. మత్స్యకారులకు మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వంద శాతం రాయితీపై చేపపిల్లలను ప్రభుత్వం ఇస్తున్నదని సూచించారు. జంగంపల్లి కి ఒక లక్షా 15,480 చేపపిల్లలను వంద శాతం రాయితీపై అందజేసినట్లు చెప్పారు. గతంలో మన రాష్ట్రం చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండేదని, ఇప్పుడు మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. మత్స్యకారులు మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన వాహనాలను రాయితీపై ఇస్తోందని చెప్పారు. తెలంగాణలో నీలి విప్లవం వచ్చిందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మాట్లాడుతూ.. వంద శాతం రాయితీపై మత్స్యకారులకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని సూచించారు. సమావేశంలో సర్పంచ్ నర్సింహులు యాదవ్, ఎంపీపీ గాల్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post