తేది 14.9.2021 టి ఎస్ బి పాస్ కింద ఇచ్చే అనుమతులపై పంచనామా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను ఆదేశించారు

ప్రెస్ రిలీజ్. తేది 14.9.2021

టి ఎస్ బి పాస్ కింద ఇచ్చే అనుమతులపై పంచనామా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను ఆదేశించారు.

మంగళవారంనాడు కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మున్సిపాలిటీ, రెవెన్యూ, ఆర్ అండ్ బి, అగ్ని మాపక శాఖలతో టి ఎస్ బి పాస్ అనుమతులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాల అనుమతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని, నూతన మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణానికి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ భవనాల పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, స్వీయ ధృవీకరణ ద్వారా పర్మిషన్ తీసుకొని దానిని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం జరిమానాలు వేయాలని, నిర్మాణాలను, సీజ్ చేయాలని, మున్సిపల్, ఆర్ అండ్ బి రోడ్లను ఆక్రమించి భవనాలు నిర్మించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమతి లేకుండా మున్సిపల్ పరిధిలో ఎవరైనా భవనాలు నిర్మిస్తే వాటిని వెంటనే నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేపట్టాలని తెలిపారు. అనుమతుల సమయంలో విపత్తుల నుండి రక్షించే ఏర్పాట్లపై పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డుల వారీగా లోకల్ కమిటీలను నియమించాలని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ ఫోర్స్ మెంట్ టీములలో ఉన్న అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చాలని అన్నారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, జిల్లా పరిషత్ సీఈవో సాయి గౌడ్, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, జగ్జీవన్, రమేశ్, కామారెడ్డి , బాన్సువాడ, ఎల్లారెడ్డి డిఎస్పీలు సోమనాథం, జైపాల్ రెడ్డి, శశాంక్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ వీరేందర్ రావ్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post