తేది 17.9.2021 న కలెక్టరేట్ ఆవరణలో స్వచ్ఛతా హి సేవా రథయాత్ర ను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు

పత్రికా ప్రకటన తేదీ:17-9-2021
కరీంనగర్

గ్రామాల పరిశుభ్రత.. ప్రగతికి సోపానం

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్

స్వచ్ఛతా హి సేవా రథయాత్ర ను ప్రారంభించిన కలెక్టర్
00000

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రగతికి సోపానం ఏర్పడుతోందని, పచ్చదనం పరిశుభ్రత పై గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛతా హి సేవ-2021 రథయాత్రను శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేశారు. పచ్చదనం పరిశుభ్రత కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకునేలా, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, పచ్చదనం పరిశుభ్రత పై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. తడి చెత్త పొడి చెత్త ను వేరుగా వేరుగా చెత్త బుట్టలలో వేసేలా,తడి చెత్త తో ఎరువు తయారు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. మన పర్యావరణం మన చేతుల్లోనే ఉందని ఇందుకోసం గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మూడు రోజులపాటు కొనసాగే రథయాత్ర, శుక్రవారం కొత్తపల్లి మండలం వెలిచాల, గట్టు బూత్కూర్ లో సాగుతోందని, మిగితా రెండు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు రాజీవ్ జోహరు, అనీషా దేవి,అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డి ఆర్ డి ఓ శ్రీలత, డి పి ఓ వీర బుచ్చయ్య, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరింనగర్ చే జారి చేయడ మైనది.

Share This Post