ప్రెస్ రిలీజ్. తేది 20.09.2021 ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసే విధంగా చూడాలన్నారు. 100% ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసిన గ్రామాల ప్రజా ప్రతినిధులను వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో వీఆర్ఏల సహకారం వైద్య సిబ్బంది తీసుకొని ఇంటింటి సర్వే ను పూర్తిచేయాలని ఆదేశించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ పర్యవేక్షణ చేపట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, వైద్య అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.
You Are Here:
Home
→ తేది 20.09.2021 ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు
You might also like:
-
కామారెడ్డి: వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్షిప్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
-
త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
-
అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్ పోస్టర్లు ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు.
-
లబ్ధిదారుల ఎదుట కొటేషన్ ఇప్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్