తేది: 21 – 9- 2021. హన్మకొండ. కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుసృ పాషా నివాసంలో ఉర్సు ఉత్సవాల ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి ల తో కలసి సమీక్షించారు.

దర్గా లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్బంగా చీఫ్ విఫ్ మాట్లాడుతూ దర్గా ఉర్సు ఉత్సవాలను 30 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతిక అని అన్నారు. కులమతాలకు అతీతంగా దర్గాల వద్ద ప్రార్దనలు జరుపు కోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నoదున, అవసరమైన లైటింగ్, రోడ్ల మరమత్తులు, పార్కింగ్ స్థలము, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, మంచి నీటి సౌకర్యం, సానిటైజర్లు, ఫస్ట్ ఎడ్ కిట్స్ అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేయాలని ఆయన సూచించారు. దాదాపు లక్ష మంది భక్తులు సందర్శించే అవకాశం ఉన్నదని భక్తుల సంఖ్య కు అనుగుణoగా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ప్రతి భక్తుడు దర్గాను ప్రశాంతంగా సందర్శించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆయన అన్నారు.

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాల విజయ వంతానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎల్లవేళ అందుబాటులో ఉంటారని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు సమన్వయముతో పనిచేస్తుందని అన్నారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు, మహిళా లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి మాట్లాడుతూ ట్రాఫిక్ ను ఎప్పటి కప్పుడు క్రమబద్ధికరించుటకు, అవసరమైన బార్ కెడింగ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపడతామని ఆయన అన్నారు. ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో నగర కమిషనర్ ప్రావీణ్య, ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు అబూబాకర్, డిసిపి పుష్ప, డి ఆర్ ఓ వాసు చంద్ర, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీను, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post