తేది 26.4.2022, నల్గొండ :: లేత అయిల్ పామ్ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

1)వేస వేడి గాలులకు అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడు కోవడానికి
1.5 మీటర్ల చుట్టుకొలత దూరములో పాదు చివర మూడు వరసలు జనుములు నాటుకోవడం వల్ల 30 రోజుల్లో ఎదిగి సూక్ష్మ వాతావరణం (micro climate) ఏర్పడి వేడి గాలులు నుంచి కాపాడుకొని మైక్రోక్లైమేట్ పాదులో ఏర్పడి మొక్కల ఎదుగుదలకు దోహద పడుతుంది.
2):అధిక ఉష్ణోగ్రత లకు ఆకు పత్రరంద్రాలు మూసుకొని భాష్పోచ్చేకం ఆగిపోయి నీరు మొక్కభాగాల్లో నిలిచిపోయి తదుపరి వంగిపోతాయి.
దీని నివారణకు జనుములు/పచ్చి రొట్ట పెంపకంతో మైక్రోక్లైమేట్ వృద్ది చెంది ఎదుగుదల బాగుంటుంది.
3) ఆ తదుపరి తొలకరి వర్షాలు మొదలు కాగానే రెండవ వారములో జనుము మొక్కలు ముక్కలుగా చేసుకొని పచ్చిరొట్ట ఎరువుగా పాదులో వేసుకో వచ్చు . ఇది కుళ్ళి పోయి ఎరువుగా మారుతుంది
4) తొలకరి వర్షాలు మొదలైన తరువాత ఎదిగే కలుపుద్వారా ఆకుపురుగులు వివిధరకాలు ఆకుతేలు(ఆకుతేలు/స్లగ్ క్యాటర్ పిల్లర్), చాఫర్ పురుగులు (ఛాఫర్ బీటిల్స్), ఆకులు తినే గొంగళి పురుగులు(లీఫ్ వెబ్బర్) ఆశించి ఆకులు తిని పాడుచేస్తాయి. ఆకులు పత్రహరితన్ని గోకి తిని జల్లెడగా చేస్తాయి. దీనివల్ల ఎదుగుదల దెబ్బ తింటుంది.
ఈ పురుగులు వల్ల లేత తోటలు 1-2 సంవత్సరాల వయసుగల వాటిలో నష్టం ఎక్కువ ఉంటుంది.
కలుపుని నియంత్రణ చేసుకోవాలి. కలుపునుండే ఉదృతి ఎక్కువవుతుంది. వీటినివారణకు ముందుగానే జూన్ మొదటి వారం లో తొలకరి వర్షాలు మొదలు కాగానే వేపనూనె 1.5 మిల్లీ + భవిష్టిన్ / carbendizam 1.5 గ్రామ్స్ / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి అ తదుపరి వారం రోజుల వ్యవదిలో క్లో్రోఫైరి ఫోస్ 50 % ఈసీ 2 మిలీ / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి.
5) కొమ్ము పురుగు నివారణకు జీవ సీలింద్రం పురుగు మందు మీటరిజిమ్ ఎన్సీపీలే అనే మందును 1 లీటరు 500 కేజీ వర్మీకంపోస్ట్ కు కలిపి ప్రతిచెట్టుకు 10 కేజీ వేయండి . జీవన సంబంధిత పురుగు మందును వాతావరణము పూర్తిగా చల్ల బడినాక వాడండి. పచ్చి పెంటను ఎట్టి పరిస్థితి లో వాడవద్దు. పూర్తిగా చీకి పోయిన ఎరువునే వాడాలి లేకుంటే కొమ్ము పురుగు ఉదృతి ఎక్కువ అవుతుంది.

Share This Post