తేది.28.8.2021. హనుమకొండ జిల్లా.ఇవియంల గోదాముల నిర్మాణానికి స్ధల సేకరణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ప్రెస్ రిలీజ్.

ఇవియంల గోదాముల నిర్మాణానికి
అవసరమైన స్ధల సేకరణను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు.

శనివారం నాడు ఆయన అదనపు కలక్టర్ సంధ్యా రాణి తో కలసి రోడ్లు మరియు రహదారుల అతిథి గృహం పరిధిలోని పలు బిల్డింగులను పరిశిలించారు. ప్రభుత్వ భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను నివేదిక రూపం లో వెంటనే సమర్పించాలని అధికారుల ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ నాగేందర్ రావు, ఈ ఈ ఎల్. రాజన్,
డి ఆర్ ఓ వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post