తేది 3.12.2021 రోజున రాత్రి చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జూవేరియా

పత్రికా ప్రకటన

తేదీ:3- 12 -2021

కరీంనగర్

80 మంది విద్యార్థులకు అస్వస్థత.

65 మంది పిల్లలు కోలుకున్నారు

15 మంది విద్యార్థులు సివిల్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జూవేరియా
o0o
చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ కాగా 30 మంది విద్యార్థులను కరీంనగర్ సివిల్ ఆస్పత్రి తరలించారని అందులో 15 మంది విద్యార్థులు కోలుకో గా తిరిగి గురుకుల పాఠశాలకు పంపించామని, మిగిలిన 15 మంది విద్యార్థులు సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువెరియా తెలిపారు. చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొత్తం 420 మంది విద్యార్థినులు ఉండగా 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలిపారు. అందులో ఎక్కువ అస్వస్థకు గురైన 30 మందిని కరీంనగర్లోని ప్రభుత్వాసుపత్రికి పంపించగా 15 మంది విద్యార్థినిలు చికిత్స అనంతరం వారిని తిరిగి వసతి గృహానికి తరలించారని తెలిపారు. మిగిలిన 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు వారు కూడా కోలుకుంటున్నారని ఆమె తెలిపారు . మిగిలిన వారికి గురుకుల పాఠశాలల్లోనే చికిత్స అందించగా అందరూ కోలుకున్నారని ఆమె తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందాన్ని మెడికల్ బృందాన్ని గురుకులపాఠశాల కు పంపించి తక్షణ వైద్య చికిత్స అందించామని ఆమె తెలిపారు. ఈ సంఘటనపై అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆర్ డి ఓ ,తాసిల్దార్, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అని ఆమె తెలిపారు.

 

Share This Post